![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -05 లో..... మహాకి వాళ్ల నాన్న పెళ్లిచూపులు ఏర్పాట్లు చేస్తాడు. తనకి అబ్బాయి బొకె ఇస్తాడు. నాకు పువ్వుల వాసన నచ్చదని మహా అంటుంది. హారిక కాఫీ తీసుకొని వచ్చి మహాకి ఇచ్చి అబ్బాయి వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది. దాంతో మహాకి ఇష్టం లేకపోయినా కాఫీ ఇస్తుంది. మరొకవైపు చక్రికి పెళ్లిచూపుల కోసం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు..
అక్కడ చక్రి.. ఒక గారె తిని ఎవరు చేశారని అడుగుతాడు. అమ్మాయి చేసిందని చెప్పగానే గారె లోపల ఉడకలేదు.. ఇంకా పిండి ఉందా అని చక్రి అడుగుతాడు. ఉందని అమ్మాయి చెప్పగానే చక్రి అమ్మాయికి గారెలు చెయ్యడం నేర్పిస్తాడు. అదంతా చూసి తన తమ్ముళ్ళకి కోపం వస్తుంది. మీకు వంట అంటే ఇష్టమా అని అమ్మాయి అడుగుతుంది. అవసరం అని చక్రి చెప్తాడు. అందరు అన్నీ మాట్లాడుకుంటారు. చక్రి వెళ్ళేటప్పుడు అమ్మాయి బాయ్ చెప్తుంది కానీ తన పేరెంట్స్ ఏ విషయం అయినా చెప్తామని అనగానే అబ్బాయి వాళ్ళు డిస్సపాయింట్ అయి వెళ్ళిపోతారు. మరొకవైపు పెళ్ళిచూపులకి వచ్చిన అబ్బాయికి నచ్చొద్దని మహా అనుకుంటుంది. అమ్మాయి, అబ్బాయి మీరు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారా అని ప్రతాప్ అనగానే దానికోసం వెయిట్ చేస్తున్నానని అబ్బాయి అంటాడు.
ఇద్దరు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. నీకు వంట వచ్చా.. కెనడాలో మేడ్ కి చాలా ఖర్చు అని అంటాడు. భార్య గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటే మహాకి కోపం వస్తుంది. ఆ తర్వాత మీ అమ్మాయికి అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా పెంచారని అబ్బాయి అనగానే హమ్మయ్య నేను నచ్చలేదని మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రపంచం అంటే ఏంటో చూపిస్తానని అబ్బాయి అనగానే మహా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |